ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ – చివ్వేంల 
ప్రభుత్వం  ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను  రైతులు సద్వినియోగం చేసుకోవాలని  తహసీల్దార్ కృష్ణయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఐలాపురం, బధ్యతండ, తుల్జా రావు పేట, కుడకుడ,  దురాజ్ పల్లి, తిమ్మాపురం, మోదిన్ పురం, వాల్య తండా,రోళ్ళ బండ తండ, లక్ష్మి నాయక్ తండ, అక్కల దేవి గూడెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. పలు కార్యక్రమాల్లో  మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ, ఏపీఎం రాంబాబు, ఆర్ ఐ శ్రీను, సి సి వెంకన్న,పార్వతి, నీలమ్మ, రేణుక, సోమని, నాగేశ్వరరావు, శ్రీను, నాగు, సురేష్, కృష్ణ, లింగ, లాలు, చాంప్ల, తదితరులు పాల్గొన్నారు.
Spread the love