తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి పీఎసీఎస్ చైర్ పర్సన్ నాగం జయసుదా సుదాకర్ రెడ్డి లి అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని మిని స్టేడియంలో మహిళా ఉత్పత్తిదారుల సంఘం, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రం విధించిన నియమా నిబంధనలో పాటిస్తూ వారికి సహకరించి ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసరావు ఎంపీడీవో సునీత, ఐకెపి సిసి ముత్తయ్య మాజీ ఎంపీటీసీ పన్నాల రమ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చురకంటి చంద్రారెడ్డి బొడ్డుపెళ్లి అంజయ్య పన్నాల మల్లారెడ్డి బండపల్లి యాదగిరి, గుగ్గులోతు కృష్ణ,,అప్ప నాయక్ , ఇమ్మారెడ్డి లింగారెడ్డి రైతులు సాబాది వెంకట రెడ్డి, తిమ్మారెడ్డి లింగారెడ్డి సాబది ఉపేందర్ రెడ్డి వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.