నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండల౦ అనాజిపురం గ్రామా ఐకెపి, మార్కెట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) శాఖ 1 కార్యదర్శి ఎదునూరి వెంకటేశం ప్రభుత్వాన్ని కోరారు. అనాజిపురం గ్రామంలో వరి చెల్లు కోసి ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారని అన్నారు. మార్కెట్లలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, వరి ధాన్యాన్ని నిలువ చేసుకోవడానికి పట్టాలు లేకా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. ధాన్యం కొనుగోలు వెను వెంటనే చెయ్యకపోవడంతో వర్షాలు పడి ధాన్యం తడిసి మోలకెత్తడంతో రైతులు ఆ ధాన్యాన్ని అమ్మడం కోసం అనేక ఇబ్బందులు పడి తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తక్షణమే ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమ ఎన్నికల వాగ్దానాలలో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి నేడు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం సరైనది కాదని దీని పూర్తిగా విరమించుకోవాలని, రైతులు పండించిన అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసే సందర్భంలో రైతులకు వివిధ రకాల కారణాలు చూపి కోత విధించకుండ చూడాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఇస్తూ క్వింటాలు ధాన్యాన్నికి ఏమాత్రం తరుగు తీసేయకుండా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.