గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

– గ్రామపంచాయతీ కార్మికులను పట్టించుకోరా?
– మంత్రి క్యాంప్‌ కార్యాలయం ముట్టడికి యత్నించిన కార్మికులు
– పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం
– మంత్రి పీఏకు వినతిపత్రం సమర్పణ
నవ తెలంగాణ సిద్దిపేట అర్బన్‌
తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావు క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కార్మికులను అడ్డుకోవడంతో పోలీసులకు కార్మికులకు, సిఐటియు నాయకులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కలగజేసుకొని కార్మికులను శాంతింపజేసి ఎట్టకేలకు కొంతమందిని అనుమతించడంతో క్యాంపు కార్యాలయంలో మంత్రి పీఏకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు రవికుమార్‌ , గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు తునికి మహేష్‌ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న చట్టబద్ధమైన సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు అంటే ప్రభుత్వానికి చిన్న చూపు అయిపోయిందని వారు చేసిన శ్రమతోనే గ్రామాలలో అభివద్ధి సాధ్యమైందని అన్నారు. నాడు సఫాయి అన్న సలాం అంటూ సన్మానించిన ప్రభుత్వమే నేడు రోడ్డున పడ్డ పట్టించుకోవడంలేదని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేసి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించి ఇన్సూరెన్స్‌ కింద 10 లక్షలు ఇవ్వాలని జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కారం దిశగా తీసుకువెళ్లాలని అన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే గ్రామాలలో అత్యవసర సేవలను కూడా నిలిపివేసి సమ్మెను మరింత ఉధతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని అర్బన్‌, రూరల్‌, నారాయణరావుపేట, చిన్నకోడూరు ,నంగునూరు మండలాలతో పాటు జనగామ నియోజకవర్గంలోని చేర్యాల కొమురవెల్లి, దూల్మీట, మద్దూరు మండలాలకు చెందిన గ్రామపంచాయతీ ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కొండపాక
గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 13వ రోజు కొనసాగుతున్న సమ్మె మంగళవారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఒంటికాలిపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల్‌ నర్సయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో 13 రోజుల నుండి సమ్మె నిర్వహిస్తూ వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కార్మికుల కోరికలు గొంతెమ్మ కోరికలు ఏమి కావని, వారివి నిజమైన డిమాండ్లని, వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. కనీస వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా ఇచ్చి మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ అధికారుల వేధింపులు వెంటనే అరికట్టాలని డిమాండ్‌ చేశారు. సమ్మెక మద్దతు తెలపాలని కోరారు. కార్మికులంతా ఐక్యంగా ఉండి పోరాటాలలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో జాలిగామ ప్రభాకర్‌ జేఏసీ నాయకులు ర్యాగల లక్ష్మణ్‌,భోగి సాయికుమార్‌,కొమ్ము ఆంజనేయులు, కోడిపెల్లి చంద్రయ్య,కొమ్ము నర్సింలు, ఏలేశ్వరం రవి,పంజా శ్రీనివాస్‌, గోపాల్‌, చిలుముల భాగ్యలక్ష్మి, దున్న మల్లవ్వ, పసుల రజిత, పుష్ప, మల్ల మరి నర్సవ్వ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-తొగుట
గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కార్మికుల మండల అధ్యక్షుడు మస్కురి శంకర్‌ అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడు తూ గంత 12 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మి కులు సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 13 వ రోజు నియోజకవర్గంలో ర్యాలీలో పాల్గొనేం దుకు వెళ్తున్నామని తెలిపారు. గత కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గ్రామపంచాయతీ సిబ్బందికి జీవో ప్రకారం వేతనాలను పెంచాలని ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.మండల గ్రామ పంచాయతీ కార్మికులు మల్లేశం, పిట్ల రాములు, వడ్డే కుమార్‌, ఇదుగల్ల భిక్షపతి, యాదగిరి, యేసు, అక్కవ్వ,కనకవ్వ తదితరులు వెళ్లారు.
నవ తెలంగాణ-గజ్వేల్‌
గ్రామపంచాయతీ కార్మికులకు 11వ పిఆర్సి ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, ఈఎస్‌ఐపిఎఫ్‌ చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలని, రాష్ట్ర జేఏసీ యూనియన్‌ నాయకులతో చర్చలు జరపాలని సీఐటీయు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 13వ రోజు చేరుకుంది ఈ సందర్భంగా గజ్వేల్‌ గడ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి గడ అధికారి ముత్యం రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యను సానుకూలంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె చట్టబద్ధంగా జరుగుతున్న సమ్మె అని ప్రభుత్వాధికారులకు 15 రోజుల ముందు నోటీసు ఇచ్చి సమ్మె చేయడం జరుగుతుందని కానీ ప్రభుత్వ యంత్రాంగం మండలాధికారులు గ్రామపంచాయతీ కార్మికులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కరోనా సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులను దేవుళ్ళని సన్మానాలు చేసిన ప్రభుత్వం నేడు పట్టించుకోవడంలేదని విమర్శించారు. గ్రామపంచాయతీల ద్వారా వేతనాలు అందజేస్తున్న నెల నెల ఇవ్వడంలేదని గ్రామపంచాయతీలకు సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు మల్టీ పర్పస్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్‌ నాయకులు సిఐటియు నాయకులు వెంకట చారి, నాయకులు స్వామి, మహాలక్ష్మి, కనకవ్వ నాగరాజు, కుమార్‌, ఎల్లం, వెంకటేష్‌, నరసింహులు, పోశయ్య నాంపల్లి మల్లయ్య, గణేషు ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
నవతెలంగాణ-దుబ్బాక రూరల్‌
జీపి కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తామని , వెంటనే జీపీ కార్మికులందరిని పర్మినెంట్‌ చేసి, వేతనాలు పెంచాలని సీఐటీయూ మండల నాయకులు ఎండి సాదిక్‌ అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె మంగళవారం 13వ రోజుకు చేరుకుంది. దీంతో వివిధ మండలాలకు చెందిన జీపి కార్మికులు దుబ్బాక మండలానికి చేరుకుని బస్టాండ్‌ నుంచి దుబ్బాక పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల నాయకులు సాదిక్‌ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు 13 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఏళ్ల తరబడి గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి, కార్మికులందరిని పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జీవో ప్రకారం వేతనాలను పెంచి, మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి పిఎఫ్‌ ఈఎస్‌ఐ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్మికులందరికీ ప్రభుత్వం న్యాయం చేసే వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీపి కార్మికులు ప్రశాంత్‌, శ్రీను,రవి, శ్రీకాంత్‌, దుర్గవ్వ, ఎల్లవ్వ, బాబాయి, లచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు.

Spread the love