– ఎంపీడీవో ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన గ్రామసభ మంగళవారం మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి రవిశ్వర్ గౌడ్ ఆ గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండావా రాజు కొండావార్ గంగాధర్ ఈరన్న వీరితోపాటు మరికొందరు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించగా గ్రామస్తులు అధికారులకు తమ ప్రజాపాలన దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందజేశారు.