నవతెలంగాణ- కమ్మర్ పల్లి : మండలంలోని బషీరాబాద్ గ్రామంలో సోమవారం సచ్ఛత హి సేవలో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో స్వచ్ఛత పై ప్రతిజ్ఞ చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ సక్కారం అశోక్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్ర పటానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళి అర్పించి, స్వచ్ఛత పై ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ అశోక అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు తోట జ్యోతి మనోహర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపసర్పంచ్ విక్రమ్, వార్డు సభ్యులు లావణ్య, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బైకాని మహేష్, నాయకులు నెల్ల రమేష్, సాగర్, రమేష్, మోహన్, దేవదాస్, ముత్తెన్న, కృష్ణ, సత్యానంద్, రాకెష్, రమేష్,, తదితరులు పాల్గొన్నారు.