రేపు పసర పంచాయితీ కార్యాలయం లో గ్రామసభ..

నవతెలంగాణ-గోవిందరావుపేట : రేపు పసర పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి పి శరత్ బాబు తెలిపారు. మంగళవారం మండలంలోని పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి శరత్ మాట్లాడుతూ  గిరిజనేతర ప్రాంతమైన రాంపూర్ గ్రామస్తులు  గతంలో పసర నాగారం షెడ్యూల్ పంచాయతీ పరిధిలో ఉంటూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ మార్చి 27న జిల్లా పంచాయతీ అధికారికి అర్జీ పెట్టుకున్నారని ఏప్రిల్ 4న జిల్లా పంచాయతీ అధికారి మౌఖిక ఆదేశానుసారం గ్రామ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ గ్రామ సభకు సంబంధిత వ్యక్తులు పూర్తి సమాచారంతో సర్పంచ్ తో సహా వార్డు సభ్యులు హాజరుకావాలని తెలియపరచడం జరిగిందన్నారు. రాంపూర్ గ్రామస్తులు పేర్కొన్న విధంగా గిరిజనులు 1/ 70, పీసా చట్టాల గ్రామసభల  తీర్మానాలతో స్థానిక గిరిజన ఇతరులకు అన్యాయం జరుగుతుందని, భూములు క్రయవిక్రయాలు సొంత ఆస్తులను కూడా అనుభవించలేని పరిస్థితులు నెలకొన్నాయని, నివాస గృహ నిర్మాణాలు మొదలు పెడితే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎటునాగారంకు ఫిర్యాదు చేసి ఎల్ టి ఆర్ నోటీసులు పంపిస్తూ నిర్మాణాలను అడ్డుకుంటున్నారని గిరిజన పంచాయతీలో జీవించలేక పోతున్నామని ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయవలసిందిగా అర్జీ పెట్టుకున్నందున అట్టి ఆధారాలను గ్రామసభ ముందు చూపించవలసి ఉంటుందని అన్నారు. ఈ విషయంపై రేపటికి గ్రామ సభకు సంబంధిత వ్యక్తులు సకాలంలో ఆధారాలతో హాజరుకావాలని సూచించారు.
Spread the love