నవతెలంగాణ-కాప్రా
కుషాయిగూడ పారిశ్రామికవాడలోని అన్నపూర్ణ ఎస్టేట్‌లో అయ్యప్ప భక్త బందం కుషాయిగూడ ఆధ్వర్యంలో అయప్ప స్వామి మహపడి పూజను కన్నుల పండువగా నిర్వహించారు. గురుస్వామి వాసిరెడ్డి శివప్ర సాద్ ఆధ్వర్యంలో మండా గంగాధర్‌రావు, బింగి శ్రీనివాస్ రావుల 18వ మహాపడి పూజను నిర్వహించారు. పూజా ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, సుభ్రమణ్యాస్వామి, అయ్యప్ప స్వామిల ప్రతిమలతో కేరళ శబరిమల ఆల యం మాదిరిగా బంగారు వర్ణంతో కుడిన 18 పడి మెట్లను ఏర్పాటు చేసి పూలు, పండ్ల తో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకు డు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరే టర్ కొత్త రామారావులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గురుస్వా ములు రఘు, ఎస్. ఆర్.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు (శేషు), వీరశేకర్, అమర్నాద్ ఎస్.రామారావు, బదార్ల సాంబశివరావు, కోమటినేని విష్ణుమోహన్‌రావు, బి. ఆనంద్‌గౌడ్, మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు.