ఘనంగా మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-కడెం
మండల కేంద్రంలోని హరిత రిసార్ట్స్‌లో మంత్రి సీతక్క జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్థానిక హరిత రిసార్టును ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పజెప్పితే ప్రజలు ఊరుకోరని అన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, రద్దు చేస్తామని తెలిపారు. లేనియడల ప్రజలు రోడ్డు మీదికి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితులు తెచ్చుకోవద్దని, ప్రయివేటు వ్యక్తులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం కడెం పెద్దూర్‌లో నిర్మించినటువంటి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల గురించి మాట్లాడారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల వద్ద డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లు, టాయిలెట్లు, విద్యుత్‌ సౌకర్యాలు పూర్తికాగానే ప్రభుత్వం తరఫున అధికారికంగా అర్హులను గుర్తించి పంపిణీ చేస్తామని తెలిపారు. ఇష్టానుసారంగా చొరబడితే చర్యలు తప్పవన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పేరు మీద రాజకీయాలు చేయడం మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు తుమ్మల మల్లేష్‌ యాదవ్‌, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు నిర్మల్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సతీష్‌రెడ్డి, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు బరుపటి రమేష్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు తారి శంకర్‌, కాంగ్రెస్‌ మాజీ మండలాధ్యక్షులు గొల్ల వెంకటేష్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పడిగెల భూషణ్‌, తాళ్ల పెళ్లి రమేష్‌, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ రెంకాల శ్రీనివాస్‌, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉట్నూర్‌ : మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌, శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్‌ కట్‌ చేసి కాంగ్రెస్‌ నాయకులకు తినిపించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల శ్రేయస్సు కోరే ప్రజా నాయకురాలు మంత్రి సీతక్క అని అన్నారు. నిరంతరం పేదల పక్షాన నిలబడతారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి మంత్రి సీతక్క ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో పాటు మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జీ ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో…
తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్‌ మంత్రి సీతక్క జన్మదిన వేడుకలను మంగళవారం ఉట్నూర్‌ మండల కేంద్రంలోని వికాసం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జీ ఆత్రం సుగుణ ముఖ్యఅతిథిగా హాజరై, కేక్‌ కట్‌ చేసి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు కేక్‌ తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ అన్ని అసమానతలతో పోరాడటం సీతక్క వ్యక్తిత్వమని, అణగారిన వర్గాల పక్షాన నిలబడాలన్నది ఆమె దృక్పథమని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా జిల్లా అభివృద్ధికి మంత్రి సీతక్క అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పథం వైపు నడిపేందుకు రాష్ట్ర మంత్రిగా సీతక్కకు దేవుడు పూర్తిస్థాయి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు అబ్దుల్‌ ఖయ్యూం, మైనార్టీ మండలాధ్యక్షుడు షేక్‌ సలీం, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఆత్రం రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శివాజీ దావత్‌, జిల్లా నాయకులు జితేందర్‌, ఆరిఫ్‌, మహిళా నాయకులు రాజవ్వ, కౌసల్య, సత్య, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
బోథ్‌ : మండల కేంద్రంతో పాటు సొనాలలోని మార్కెట్‌ యార్డులో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ బొడ్డు గంగారెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌లు రాజు యాదవ్‌, లోలపు పోశెట్టి, వీడీసీ అధ్యక్షులు గట్ల గంగాధర్‌, నాయకులు షేక్‌ షాకీర్‌, మేరుగు భోజన్న, శేఖర్‌, అబ్దుల్‌ హసీబ్‌ పాల్గొన్నారు.

Spread the love