ఘనంగా ఉషాదయాకర్ రావు జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – పెద్దవంగర
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషాదయాకర్ రావు జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈదురు ఐలయ్య, శ్రీరామ్ సంజయ్ కుమార్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు- ఉషాదయాకర్ రావు దంపతులు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అనునిత్యం నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. కరోనా కష్ట సమయంలో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ, ఆనందయ్య మందు పంపిణీ, నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబెర్ ఎండీ ముజీబుద్దీన్, మండల యూత్ అధ్యక్షుడు కాసాని హరీశ్, గ్రామ పార్టీ అధ్యక్షులు బోనగిరి లింగమూర్తి, రెడ్డబోయిన గంగాధర్, ఆరుట్ల వెంకట్ రెడ్డి, పులిగిల్ల కుమారస్వామి, మండల ప్రచార కార్యదర్శి పులిగిల్ల పూర్ణచందర్, మాజీ సర్పంచ్ చింతల భాస్కర్, మాజీ ఉపసర్పంచ్ శ్రీరాం రాము, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి, మండల సీనియర్ నాయకులు విశ్వనాథుల జ్ఞానేశ్వర్ చారి, బొల్లు సతీష్, బొల్లు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love