ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – పెద్దవంగర
బీఆర్ఎస్ వ్వవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మండల వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మండల సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్ ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అలుపెరుగని పోరాటం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేసి, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందారని అన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉండి, పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అంకితం చేశారని అన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, ఎంపీటీసీ బానోత్ రవీందర్ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి, కూకట్ల వీరన్న, బానోత్ శ్రీను, తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, రాసాల సమ్మయ్య, చింతల భాస్కర్, వేముల రఘు, మొర్రిగాడుదుల శ్రీనివాస్, జాటోత్ హేమాని, అనపురం రవి, దుంపల వేణు, జాటోత్ శంకర్, గిరగాని రవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love