ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

నవతెలంగాణ పెద్దవంగర: మండల వ్యాప్తంగా గురువారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలతో అలంకరించారు. శ్రీకృష్ణుడి భక్తి పాటలకు చిన్నారులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. పలు గ్రామాల్లో ఉట్టి కొట్టి కృష్ణాష్టమి సంబరాలు జరుపుకున్నారు.
Spread the love