ఘనంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-దుండిగల్‌
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. కుత్బుల్లాపూర్‌ నియో జకవర్గం నుండి అన్ని ప్రాంతాల ప్రజలు, ఇతర ప్రాంతాల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలప డానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడికి గజమాలలు వేసి, భారీ కేక్‌, కట్‌ చేయించి, పూల దండాలు శాలువాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్‌, మెదక్‌ జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి, మహబూబ్‌ నగర్‌ జిల్లా అధ్యక్షులు జి.మధుసూదన్‌ రెడ్డి, ఫిషర్మాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు సాయి కుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆవుల రాజి రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.

Spread the love