హుస్నాబాద్ లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం హుస్నాబాద్ పట్టణం, మండల పరిషత్ కార్యాలయం తో పాటు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు బోజు రమాదేవి రవీందర్ , వాళ్ల సుప్రజ, బోజ్జా హరీష్, గూల్ల రాజు, చిత్తారి పద్మ తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లకావత్ మానస సుభాష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామాలలో సర్పంచ్ లు గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి, ఎంపీ ఓ సత్యనారాయణ, సర్పంచులు వంగ విజయలక్ష్మి, తరాల లత మహేందర్, తోడేటి రమేష్, గంగం మదన్ మోహన్ రెడ్డి, పిట్టల సంపత్, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు తోటపల్లి గ్రామంలో జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. సిపిఐ పార్టీ కార్యాలయం లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపి మల్లేష్ జెండాను ఆవిష్కరించారు.

Spread the love