నవతెలంగాణ- నేలకొండపల్లి
సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంఘం జెండాను సిఐటియు జిల్లా నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు చెరుకు శ్రీను, తిరుపతిరావు, వెంకటేష్, సైదులు, కనకారావు, బాబురావు, మధు తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్: సిఐటియు వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని వైరా పట్టణంలోని ఎఎంసి హమాలీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ జిల్లా నాయకులు షేక్ జమాల్ సాహెబ్ సిఐటియు జెండాను ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన సభలో సిఐటియు వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు, సీనియర్ జిల్లా నాయకులు షేక్ జమాల్ సాహెబ్ మాట్లాడారు. కార్యక్రమంలో కార్మికులు బండ్ల వెంకటి, చేబ్రోలు కష్ణమూర్తి, నిజాం, చంటి, నరసింహారావు, వాసు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి : శ్రామికుల చెమట బిందువుల నుంచి సీఐటీయూ ఆవిర్భవించిందని, అందుకే కార్మిక హక్కుల కోసం సీఐటీయూ నిరంతరం పోరాటాలు చేస్తోందని ఆ సంఘ నాయకులు మోరంపూడి పాండురంగారావు, కొలికపోగు సర్వేశ్వరరావు అన్నారు. మంగళవారం సత్తుపల్లిలో సీఐటీయూ 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం ఎదుట జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వలీ, వెంకటేశ్వరరావు, బాజీ, చంద్రం, రబీ, బాబు, బడే, జిలాని, రామకృష్ణ, రమేశ్, దివాకర్, రవి, కిశోర్, కుమార్, మీరా, సైదా పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : కార్మికుల పక్షాన తమ హక్కులను కాపాడేది సిఐటియు మాత్రమేనని సిఐటియు జిల్లా నాయకులు వసపొంగు వీరన్న అన్నారు సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వివిధ గ్రామాలలో కార్మికులతో కలిసి వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పల్లె రమేష్, సత్తిబాబు, వెంకన్న, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.