ఘనంగా గాణతంత్ర దినోత్సవ వేడుకలు

– జిల్లా పరిషత్ పాఠశాలలో జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు ప్రజా ప్రతినిధులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తదితరులు మాట్లాడుతూ డా,బీఆర్ అంబెడ్కర్ కృషి వల్ల ఆయన రాసిన రాజ్యాంగం వల్లే భారత దేశంలోని ప్రజలు తమ తమ హక్కులతో స్వేచ్ఛాయుతంగా బ్రతకడం ఆయనే కృషినే అని పలువురు కొనియాడారు.మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాణి తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ దశరథ్,పోలీస్ స్టేషన్లో  ఏఎస్ఐ రాములు మరియు పలు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జెండాను ఆవిష్కరించాడం జరిగింది.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేసి ప్రజలను ఆలపించారు. ఇందులో బాగంగా జిల్లా ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ప్రస్తుతం దేశ సరిహద్దులో జవాన్లు గా  విధులు నిర్వహిస్తున్న వారిని పాఠశాల మరియు గ్రామ యువకుల తరపున సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామస్థులు విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love