నవతెలంగాణ-తొర్రూరు
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై టీపీటీఎఫ్ అలు పెరుగని పోరాటం చేసిందని తొర్రూరు మండల శాఖ అధ్య క్షుడు కొలుపుల శ్రీనివాస్ అన్నారు. సోమవారం స్థానిక టీపీ టీఎఫ్ భవన్‌లో మండల శాఖ అధ్యక్షులు కొలుపుల శ్రీనివా స్ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన తెలంగాణ ప్రాంతంలో తె లంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్‌గా 2014 మే 29న ఆ విర్భవించినదని ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల కొరకు అనేక పో రాటాలు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని, 1996కు ముందు ఉపాధ్యాయుల బదిలీలు, పోస్టింగ్లను రా జకీయ జోక్యం అవినీతి లేకుండా కౌన్సిలింగ్ పద్ధతిలో నిర్వ హించడానికి ప్రధాన కారణం ఏపీటీఎఫ్ అని అన్నారు. సా మాజిక చైతన్యంతో తన వంతు బాధ్యతగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలో ప్రభుత్వ విద్యారంగా న్ని కాపాడుటకు చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు న్న పరిస్థితుల్లో బలమైన ఉపాధ్యాయ ఉద్యమాలను నిర్మిం చవలసిన అవసరం ఉందని బలంగా విశ్వసిస్తోందని, అం దుకుగాను కలిసివచ్చే అన్ని సంఘాలతో ఉద్యమాలు నిర్మిం చడానికి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉండి కృషి చేస్తోం దన్నారు. 317 జీవో విషయంలో, పరస్పర బదిలీల విష యంలో, పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ఆదర్శ, కేజి బివి సమస్యలపై ప్రాతి నిధ్యాలు చేయడమే కాకుండా, తన దైన శైలిలో పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తున్న సంఘం టీపీటీఎఫ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో టీ.హేమాద్రి, ప్ర భాకర్, అనంతరెడ్డి, టి.రమేష్, కె.రమేష్, శ్రీనివాస్, రవీంద్ర కుమార్, జనార్ధన్ ,పవన్ కుమార్, ఎల్లగౌడ్, కుమార్, వీర న్న, ప్రవీణ్ కుమార్, అశోక్ పాల్గొన్నారు.
బయ్యారం : విద్యా రంగ సమస్యలను వెంటనే పరిష్క రించాలని రాష్ట్ర కౌన్సిలర్ తండా సదానందం అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని మండల రిసోర్స్ సెంటర్ వద్ద తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భావదినో త్సవ కార్యక్రమం మండల శాఖ అధ్యక్షులు షేక్ మీరా అధ్య క్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయు లు సీహెచ్.వేణుగోపాల్‌రెడ్డి టీపీటీఎఫ్ జెండా ఎగర వేయ డం జరిగింది. సదానందం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లో కన్నా తక్కువ నిధులు కేటాయించడం వల్ల తెలంగా ణలో విద్యాభివృద్ధి వెనుకంజలో ఉన్నదని గతంలో ఫెడరేష న్ వ్యవస్థాపకులు సింగరాజు రామకృష్ణయ్య, చెన్నుపాటి ల క్ష్మయ్య, మాణిక్యాంబరాలు లాంటి నాయకులు ఎందరో సం ఘ స్థాపనకు హక్కును కల్పించి ఎన్నో ఇబ్బందులకు వచ్చి ఉద్యమాలను నిర్మించి సాధించుకున్న సదుపాయాలను నేటి ప్రభుత్వాలు కాలరాయడం విద్యారంగా అభివృద్ధికి ఆటంకం అన్నారు. జిల్లా కార్యదర్శి కొమిరె ఉప్పలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించే సమయం ఆసన్నమవు తున్నందున పాఠశాల విద్యా క్యాలెండర్‌ను ప్రకటించి పాఠ శాల ప్రారంభం రోజున అన్ని రకాల పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్‌లు అందించేలా చర్యలు తీసుకోవా లని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బాధ్యులు బెల్లి లక్ష్మ య్య, రామనాథం, ఆర్.వెంకటేశ్వర్లు, వి.లింగరాజు, బయ్యా రం వీరన్న, తీగల రమేష్, మౌలా, వెంకట స్వామి, సైదులు తదితరులు పాల్గొన్నారు.
గూడూరు : పేరుకుపోయిన ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా కా ర్యదర్శి మమ్మద్ మహబూబ్ అలీ అన్నారు. పదవ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని గూడూరు మండల శాఖ ఆధ్వ ర్యంలో టీపీటీఎఫ్ జండాను ఎంఆర్‌సి కార్యాలయంలో ఆవి ష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మమ్మద్ మహ బూబ్ అలీ మాట్లాడుతూ టీపీటీఎఫ్ నిరంతరం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం,అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో టీపీటీఎఫ్ మం డల అధ్యక్షుడు సోమ రవి, కార్యదర్శి ఈక ఆదినారాయణ, ఉపాధ్యక్షులు జి.నర్సయ్య, కోశాధికారి మమత, సంపత్, సు ధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ : ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా అం దే విద్య ప్రతీ విద్యార్థిని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని టీపీటీఎఫ్˜్ జిల్లా అధ్యక్షులు చుంచు శ్రీశైలం అన్నారు. సోమ వారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబా బాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చుంచు శ్రీశైలం అధ్యక్షతన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, బలా స్టి రమేష్ సంయుక్తంగా జెండా ఆవిష్కరణ చేయడం జరి గింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు చుంచు శ్రీశైలం మాట్లాడుతూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరే షన్ ఉపాధ్యాయుల సమస్యల పట్ల, ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ పట్ల అలుపెరగని పోరాటం చేస్తూ, ప్రజల పక్షాన నిలబడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థలను, అందులో విద్యను అభ్యసించే విద్యార్థులను కాపాడుకుంటూ వస్తున్న ఏకైక సంస్థ ఫెడరేషన్ అన్నారు. జిల్లా కార్యదర్శి సోమ విష్ణువర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని, విద్యా ర్థులకు పాఠ్యపుస్తకాలను పాఠశాలల ప్రారంభం కంటే ముం దే అందించాలన్నారు. అలా జరిగితేనే సకాలంలో పాఠ్యాంశా లు బోధించబడి, విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చీకటి.ఉపేందర్, సీని యర్ నాయకులు బి.రాజు, బి.అంజయ్య, బిక్షపతి మహ బూబాబాద్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాచకొండ. ఉ పేందర్, సజ్జనం విద్యాసాగర్, నాయకులు వై.యాకయ్య, ఏ.గోవర్ధన్,మనోహర్,పి.రమేష్, కే వెంకటేశ్వర్లు, గణపురం. బిక్షపతి, గునిగంటి శ్రీనివాస్, ఎండి రఫీక్, బాబురావు,కోడెం శ్రీనివాస్, ప్రకాష్, బాలచందర్, కార్తీక్, నరేష్ పాల్గొన్నారు.
పెద్దవంగర : విద్యారంగం సమస్యలు, ఉపాధ్యాయ హక్కుల సాధన కోసం టీపీటీఎఫ్ నిరంతర పోరాటం చే స్తుందని ఆ సంఘం మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్ అ న్నారు. సోమవారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో టీపీటీఎఫ్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన టీపీటీఎఫ్ జెండా ఎగు రవేశారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు సోమారపు ఐల య్య మాట్లాడారు. ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో తల పెట్టే ఉద్యమాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దేవేందర్ నా యక్, జిల్లా కౌన్సిలర్ సురేష్, సురేంద్ర కుమార్, వెంకటేశం, శ్రీనివాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : ప్రభుత్వ విద్యారంగా సమస్యలను తక్ష ణమే పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సై దులు పాషా, మండల ప్రధాన కార్యదర్శి సంఘ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని టిపిటి ఎఫ్ మండల అధ్యక్షుడు బాలు అధ్యక్షతన పదవ ఆవిర్భావ దినోత్సవం సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను,ఉపాధ్యాయుల బదిలీలు, పదో న్నతులు నిర్వహించుటకు హైకోర్టులో ఉన్న స్టేను ఎత్తివేసే లా ప్రభుత్వం కృషి చేసి బదిలీలను పాఠశాలల పునఃప్రారం భంలోగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో సబ్ కమిటీ సభ్యులు ఎం.రవి, జే.రాజు, కే. నవీన్, ఎస్.ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.