– వాడవాడల వెలిసిన వినాయక విగ్రహాలు
నవతెలంగాణ-వీణవంక : మండలంలో వినాయక చవితి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను విక్రయించి గ్రామాల్లో డప్పు చప్పులతో ఊరేగించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలల్లో ప్రతిష్టించారు. అనంతరం పూజారులతో పూజలు చేశారు. మండలంలో సుమారు 200 వరకు విగ్రహాలు ఏర్పాటు చేయగా మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి, ఎల్బాకలో జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కాగా రెండో రోజైన మంగళవారం అన్ని మండపాల్లో ప్రత్యేక పూజలు చేశారు.