ఘనంగా వై ఎస్ ఆర్ జయంతి వేడుకలు..

నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్ పుర్ గ్రామంలోని సిఎస్సి ఆస్పత్రిలో ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 74 వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాదు రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి పాల్గొని ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.అనంతరం ఆసుపత్రి వైద్యులతో సిబ్బంది, ఆస్పత్రికి వచ్చే రోగులు, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, డిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, శ్యాంసన్, వాసు, ధర్మ గౌడ్, నరేష్, లింగం, వెంకటేష్, సతీష్ రెడ్డి తోపాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love