టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు కన్నుమూత

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాల కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపాల కృష్ణ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున గోపాల కృష్ణ తన నివాసంలో తుదిశ్వాస వదిలారు. ప్రకాశం పంతులుకు ఇద్దరు కుమారులు కాగా.. రెండో కుమారుడు హనుమంతరావు కుమారుడే గోపాల కృష్ణ. టంగుటూరి గోపాల కృష్ణ మరణంతో ఆయన కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి.

Spread the love