ఎస్సీ కమ్యూనిటీ భవనాలకు నీదులు మంజూరు..

– ప్రోసెసింగ్ పత్రం అందజేత.. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. 
నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి  గ్రామానికి చెందిన మాదిగ సంఘానికి ₹7.50 లక్షల ప్రోసిడింగ్ ఆర్డర్స్ పత్రాలను మంగళవారం ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పంపిణీ చేశారు.ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణం కోసం ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్దన్‌ గారు తన ఎస్ సి డి డి  నిధుల నుంచి రూ.₹ 7.50 లక్షలను మంజూరు చేయించారు.ఎస్సీ కమ్యూనిటీ సోదరులు తమ సొంత స్థలంలో భవన నిర్మాణం చేసుకుంటామని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ని కలిసి కోరిన వేంటనే నిధులు కేటాయిస్తూ ప్రొసీడింగ్‌ ఆర్డర్స్ పత్రాలను సంబంధిత ఎస్సీ కమ్యూనిటీ కుల సంఘ సభ్యులకు పంపిణీ చేశారు.  ఎస్సీ కమ్యూనిటీ కుల సంఘ సభ్యులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా యువ నాయకులు, జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు, ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ లకు  ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love