హైదరాబాద్ : ఔషధ ఉత్పత్తుల కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా రికార్డ్ లాభాలను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 181 శాతం వృద్ధితో రూ.134 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ కంపెనీ గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.48 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.985 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ1లో 20 శాతం పెరిగి రూ.1,180 కోట్లకు చేరింది. గడిచిన జూన్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించామని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటి తెలిపారు. పేరా, ఏపీఐ, పీఎఫ్‌ఐ అమ్మకాల ధరల స్థిరీకరణలో క్షీణత ఉందని పేర్కొన్నారు.