
రాజంపేట్ మండలంలోని తలమడ్ల గ్రామంలో యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయికుమార్ (18) శనివారం గడ్డి మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుండి నూరుగు రావడం గమనించిన కుటుంబీకులు వివరాలు అడిగారు. అప్పుడు గడ్డి మందు తాగినట్టు సాయికుమార్ తెలిపారు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయికుమార్ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలించారు. కాగా మృతుడు సాయికుమార్ ఐటిఐ చదువుకుంటున్నట్లు సమాచారం. కుటుంబ కలహాలు లేదా ఇతర కారణాల వలన ఆత్మహత్య చేసుకున్నాడా మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.