ఘనంగా గణపతి ఉత్సవాలు

నవతెలంగాణ – సిద్దిపేట : గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం వాడవాడలా, ప్రజలు తమ ఇండ్లలో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తమ ఇండ్లలో ఉదయం గౌరీ పూజలు నిర్వహించారు. పురుషులు గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలను చేసి, ఉండ్రాలు, ప్రత్యేకమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించారు. వాడవాడలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను నిర్వాహకులు విద్యుత్ దీపాలతో, ఇతర అలంకరణ వస్తువులతో అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను పంచిపెట్టారు.
Spread the love