సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐ సుందరయ్యకు ఘన సన్మానం

నవతెలంగాణ-ఆమనగల్‌
ఆమనగల్‌ నుంచి బదిలీపై వెళ్తున్న సీఐ జాల ఉపేందర్‌, ఎస్‌ఐ సుందరయ్యను ఘనంగా సన్మానించారు. మంగళవారం ఆమనగల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పలువురు న్యాయవాదులు, వివిధ పార్టీల నాయకులు సీఐ జాల ఉపేందర్‌ రావుతో పాటు ఎస్‌ఐ సుందరయ్యను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం కోఆర్డినేటర్‌, ప్రముఖ న్యాయవాది అండేకార్‌ యాదిలాల్‌, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ నేనావత్‌ పత్య నాయక్‌, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం, సర్పంచులు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, సోనా శ్రీను నాయక్‌, మలమ్మ యాదయ్య, ఎంపీటీసీ సభ్యులు సరిత పంతు నాయక్‌, దోనాదుల కుమార్‌, కడ్తాల్‌ తలకొండపల్లి ఎస్‌ఐలు హరిశంకర్‌ గౌడ్‌, వెంకటేష్‌, నాయకులు గుత్తి బాలస్వామి, ఉప్పల రాములు, రమేష్‌ నాయక్‌, గణేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love