ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీ సాయి హాస్పిటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు ఉచితవైద్య సేవలతోపాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోసర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు జయప్రకాశ్ సింగ్ జాదవ్, బానోత్ కల్పన మాట్లాడుతూ.. శ్రీ సాయి హాస్పిటల్లో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు.

Spread the love