ఘనంగా రన్ ఫర్ జీసస్..

నవతెలంగాణ – చివ్వేంల 
గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌లను పురస్కరించుకుని చివ్వేంల గ్రామం లో ఆదివారం రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చివ్వేంల మన్నా చర్చి  ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాస్టర్ బి. సామ్యేల్  జెండా ఊపి రన్‌ ఫర్‌ జీసస్  కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాస్టర్ బి. సామ్యేల్  మాట్లాడుతూ మానవాళి పాప విమోచనానికి యేసు క్రీస్తు తన ప్రాణాలను శిలువలో అర్పించిన రోజున గుడ్ ఫ్రైడేగా, తిరిగి మూడో రోజు ఆదివారం సమాధి లో నుండి లేచిన రోజును  ఈస్టర్ గా జరుపుకుంటామని తెలిపారు. సంగీత పరిచర్య బెన్ని బ్రదర్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో విశ్వాసులు, సంఘ పెద్దలు, సంఘస్తులు   తదితరులు పాల్గొన్నారు.
Spread the love