నవతెలంగాణ – హైదరాబాద్: జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ జయకేతనం ఎగురవేసింది. 183 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వేను 159/6కే కట్టడి చేసి 23 పరుగుల తేడాతో గెలిచింది. ఆ జట్టులో మయర్స్ హాఫ్ సెంచరీ(65)తో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో సుందర్ 3, అవేశ్ 2, ఖలీల్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ 5 టీ20ల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది.