కురిసిన తొలకరి జల్లుల పలకరింపు

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా ఆదివారం తొలకరి జల్లులు కురిసి పలకరింపు చేశాయి. ఎన్నో రోజులుగా ఎండలకు వడగలుపులకు ఇబ్బందులు పడ్డ ప్రజలు ఉదయం నుండి వాతావరణం చల్ల పడడంతో పాటు జల్లులు కురవడంతో తొలకరి ప్రారంభమైందన్న వాతావరణం ఏర్పడిందని తెలుపుతున్నారు. ఇప్పటికే పొలాలను చదును చేసిన రైతులు ఒకటి రెండు రోజులు వర్షాలు కురిస్తే వరినారులు పోసుకోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరుజల్లులు పడుతూ వాతావరణం చల్లబడడంతో ప్రజలు సంతోషమైన అనుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరో జల్లు పడితే పత్తి విత్తనాలు నాటుకోవచ్చని రైతులు పేర్కొంటున్నారు. తొలకరి జల్లులు కురిసి తొలకరి ఆరంభమైంది అన్న సంకేతాన్ని ఇచ్చిందని కర్షకులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలు వర్షంలో తడుస్తూ కేరింతలు కొట్టారు.

Spread the love