నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నెలవంక దర్శనంతో ప్రారంభ మైన పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ముస్లిం సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. పరమ పవిత్రమైన రంజాన్ మాసం క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనను పెంపొందించి, ఆదర్శవంతమైన జీవితం దిశగా ప్రేరణనిస్తుందని అన్నారు. ఖురాన్ ఉద్భవించిన పరమ పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ఖురాన్ పఠనం, ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, జకాత్, ఫిత్రా వంటి ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత, జీవిత పరమార్థం అవగాహనలోకి వస్తాయని అన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనీ, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలనీ ఆకాంక్షించారు.