నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ ప్రజలందరికి సంక్రాంతి పర్వదిన సందర్భంగ పోలీస్ శాఖ తరఫున నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ శుభాకాంక్షలు తెలియజేశారు.ఇంటిళ్లుపాది అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవడం మన అందరి సాంప్రదాయం అని తెలిపారు. ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో మరియు సుఖ సంతోషాలతో జీవనము గడపాలని సూచించారు. ఎల్లప్పుడు ప్రజలు పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా మరియు సోదరభావంతో మెలుగ గలరని కోరుకుంటున్నాను అని అన్నారు.