నవతెలంగాణ-పెద్దవంగర
మండలంలోని అర్హులైన పేదలందరికీ ‘గృహలక్ష్మి’ పథకం ద్వారా సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ‘గృహలక్ష్మి’ దరఖాస్తులపై ఎంపీపీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు గృహలక్ష్మి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే అర్హులను ఎంపిక చేయాలన్నారు. పారదర్శకంగా అర్హుల జాబితాను రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మండలంలోని అర్హులందరికీ గృహలక్ష్మి ద్వారా ఇండ్ల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎంపీఓ సత్యనారాయణ, ఆర్ఐ భూక్యా లష్కర్, ఎంపీటీసీ సభ్యులు ఏదునూరి శ్రీనివాస్, అనురాధ, బీఆర్ఎస్ నాయకులు బానోత్ సోమన్న, ఎర్ర వెంకన్న, ఈరెంటి శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ సోమన్న, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.