గ్రూప్‌-2, 3 పరీక్షలను వాయిదా వేయాలి

– నిరుద్యోగుల పట్ల నిరంకుశత్వ తగదు : ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ కోరాయి. నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించకుండా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని సూచించాయి. ఈ మేరకు ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌మూర్తి, కార్యదర్శి తాళ్ల నాగరాజు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటరమేశ్‌, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘డీఎస్సీ పరీక్షలను ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్నది. డీఎస్సీ రాసే వారిలో గ్రూప్‌ -2, గ్రూప్‌ -3 అభ్యర్థులు కూడా ఉన్నారు. గ్రూప్‌- 2 పరీక్షలు ఆగస్టు ఏడు, ఎనిమిది తేదీల్లో ఉన్న నేపథ్యంలో డీఎస్సీ రాసేవారికి ప్రిపరేషన్‌కు సమ యం సరిపోదు. ఈ కారణంతోనే నిరుద్యోగులు కనీసం నెలపాటు గ్రూప్‌ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్‌ కూడా సరై నదే, గతంలో పేపర్‌ లీకేజీలు, టీజీపీఎస్సీ తప్పిదాలతో రాష్ట్రంలో నిరు ద్యోగులు చాలా కాలాన్ని నష్టపోయారు. డీఎస్సీ, గ్రూప్స్‌ సిలబస్‌ వేర్వేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ సున్నితమైన అంశంపై అభ్యర్థులతో చర్చించి పరిష్కారం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐగా కోరుతున్నాం. నిరు ద్యోగులను అరెస్టు చేసి కేసులు పెట్టడం, నిర్బంధించడం సరైన చర్య కాదు.
గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో గ్రూప్‌-1 పోస్టుల కంటే అదనంగా 63 పోస్టులు పెంచి పరీక్ష నిర్వహించినట్టుగానే గ్రూపు-2, గ్రూపు-3లలో కూడా పోస్టులను పెంచే ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అరెస్టు చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Spread the love