నవతెలంగాణ – హైదరాబాద్
గ్రూప్-2 పరీక్షలు రేపటి ఆదివారం, సోమవారం జరుగుతున్న దృష్ట్యా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయంలో చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 101 పరీక్ష కేంద్రాలకు గాను నగరం నలుమూలల నుంచి బస్సులు అందుబాటులో ఉంచడంతో పాటు సెంటర్ల నుంచి తిరుగు ప్రయాణానికి సైతం బస్సులు అందుబాటులో ఉంటాయని వివరించారు. బస్సుల సమాచారం కోసం.. కోఠి – 99592 26160, రేతిఫైల్ బస్ స్టేషన్ – 99592 26154 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.