ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 4 సర్వీసెస్ పరీక్ష

నవతెలంగాణ-గోవిందరావుపేట

మండలంలో గ్రూప్ ఫోర్ సర్వీసెస్ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 216 అభ్యర్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 188 అభ్యర్థులు హాజరైనట్లు పరీక్షల నిర్వాహకులు మరియు కళాశాల ప్రిన్సిపల్ జిలకర వెంకన్న తెలిపారు. అదేవిధంగా పసర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఏర్పాటుచేసిన సెంటర్లో 144 మంది హాజరు కావాల్సి ఉండగా 123 మంది పరీక్షకు హాజరైనట్లు మండల విద్యాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోంది దివాకర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ తో పాటు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు ఎస్ ఐ సి హెచ్ కరుణాకర్ రావు తెలిపారు. మొత్తం మీద పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్ష రాసేవారికి అవసరమైన వైద్య మరియు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు.
Spread the love