నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష జరుగుతుంది. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 అయిపోయింది. ప్రస్తుతం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష కొనసాగుతుంది. కాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భార్యభర్తలు ఇద్దరు గ్రూప్- 4 పరీక్ష రాయడానికి వచ్చారు. దీంతో సదరు దంపతుల 3 నెలల చిన్నారిని పోలీసులు లాలించారు. కురవి మండల పెద్దతండాకు చెందిన జగ్గులాల్, సబితా దంపతులిద్దరికి గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యారు. వారి చిన్నారిని నాన్నమ్మ దగ్గర ఉంచగా పాప బాగా ఏడుస్తుండటంతో మహిళ కానిస్టేబుల్ శ్రీలత చిన్నారిని దగ్గర తీసుకొని లాలించారు. మంచం తెప్పించి చెట్టుకింద పడుకోబెట్టారు. తొర్రురులో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పలువురు చిన్నపిలల తల్లులు కూడా పరీక్షకు హాజరయ్యారు. వారి పిల్లలకు పోలీసులు అరటిపండ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించి మానవత్వం చాటుకున్నారు. మానవత్వం చూపిన పోలీస్ సిబ్బందిని తొర్రురు డీఎస్పీ రఘు, తొర్రురు సీఐ సత్యనారాయణ ఎస్సై సతీష్, ఎస్సై రాంజీ నాయక్ అభినందించారు.