– మూగజీవాలను కాపాడిన పోలీసులు
నవతెలంగాణ కోదాడరూరల్
పాడుబడ్డ గోధుం లో గుట్టుగా నిర్వహిస్తున్న వ్యాపారాన్ని రూరల్ పోలీసులు చేదించి గుట్టు విప్పిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.
కోదాడరూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా కోదాడ కు చెందిన షేక్ గులాం, షేక్ గౌస్ లు మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ శివారులోని ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ పాడుబడ్డ గోదాంలో ఎలాంటి అనుమతి లేకుండా పశువులు కొనుగోలు చేసి వాటిని కబేళాలకు తరలించడానికి సిద్ధం చేశారు. వీటిని హైదరాబాద్ కు తరలించనున్నట్టు తెలిపారు. పక్కా సమాచారం తో కోదాడ రూరల్ పోలీసులు దాడి చేసి వాటిని గోశాలకు తరలించినట్టు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మూగజీవాలను కాపాడినందుకు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.