– నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్
హైదరాబాద్ : ప్రస్తుత ఏడాది ఆగస్ట్‌లో హైదరాబాద్‌లో ఆస్తుల రిజిస్ట్రే షన్లలో 15 శాతం వృద్థి చోటు చేసుకుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గడిచిన నెలలో 6,493 నివాస ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయని.. వీటి విలువ రూ.3,461 కోట్లుగా ఉందని తెలిపింది. గతేడాది ఇదే మాసంలో 5,656 ప్రాపర్టీలు రిజిస్ట్రర్ అయ్యాయి. హైదరా బాద్ నివాస మార్కెట్‌లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను పరిగణలోకి తీసుకుంది. అత్యధికంగా అమ్ముడయిన వాటిలో రెండు పడక గదులున్నాయి. 1000-2000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్రాపర్టీలు 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి.