నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ

నవతెలంగాణ – హైదరాబాద్
జీఎస్‌ఎల్‌వీ ద్వారా మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. సోమవారం శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నావిగేషన్‌ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపనున్నది. ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్‌ వ్యవస్థ మరింత మెరుగుపడనున్నది. నావిగేషన్‌ సేవల కోసం గతంలో పంపిన వాటిలో నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసిందని, వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ శనివారం వెల్లడించారు.

Spread the love