వచ్చే నెల 7న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం..

nirmala sitaramanనవతెలంగాణ-హైదరాబాద్ : వస్తు, సేవల పన్నుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం వచ్చే నెలలో జరగనుంది. అక్టోబర్‌ 7వ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 52వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా వెల్లడించింది. అయితే, ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చించనున్నారో మాత్రం వెల్లడించలేదు.

Spread the love