జ్ఞాన ప్రధాత గురువు
విజ్ఞాన విధాత గురువు
గురువు లేని విద్య
గుర్తింపు లేని విద్య
సూచనలిస్తూ సన్మార్గం నడిపించే
ఒడవని విజ్ఞాన సూత్రదారి
ప్రశ్నకు జవాబులు ఇస్తూ
కాటిన్యాన్ని సులభతరం చేస్తూ
కొండ గుర్తులను అపాదించి
మెదడుకు మేత వేసే మ్యాతరి
అమ్మ నాన్నలు జన్మ కర్తలు
గురువు భవిష్యత్తు కర్త
సూక్ష్మ నుంచి మోక్షాన్ని ప్రసాదిస్తాడు
సోపాను క్రమ విద్యకు
గట్టి పునాది నిర్మిస్తాడు
కర్త కర్మ క్రియలకు మార్గదర్శి
– ఆర్కల రాజేష్, 9177909700