న‌లుగురు ఐఎస్ఐఎస్ స‌భ్యుల్ని అరెస్టు చేసిన గుజ‌రాత్ ఏటీఎస్ పోలీసులు

నవతెలంగాణ – పోరుబంద‌ర్‌: ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద సంస్థ‌తో లింకు ఉన్న న‌లుగురు వ్య‌క్తుల్ని గుజ‌రాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పోరుబంద‌ర్ నుంచి ఆ వ్య‌క్తులు అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ‌తో కార్య‌క‌లాపాలు జ‌రుపుతున్న‌ట్లు గుర్తించారు. గుజ‌రాత్ డీజీపీ వికాశ్ సాహే దీనిపై మీడియా ప్ర‌క‌ట‌న చేశారు. ఖొరాస‌న్ ప్రావిన్సుకు చెందిన న‌లుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదుల్ని అరెస్టు చేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. యాంటీ టెర్ర‌రిస్టు స్క్వాడ్ బృందాలు ఆ ఉగ్ర‌వాదుల్ని అరెస్టు చేసిన‌ట్లు చెప్పారు. అరెస్టు అయిన వారిలో సూరత్‌కు చెందిన సుమేరా అనే మ‌హిళ ఉంది. ఐఎస్ మాడ్యూల్‌లో ముగ్గురు స‌భ్యులు యాక్టివ్‌గా ఉన్నారు. ఐసిస్‌తో ట‌చ్‌లో ఉన్న ఆ వ్య‌క్తులు ప్ర‌భావానికి లోనైట్లు పోలీసులు తెలిపారు. చాన్నాళ్ల నుంచి ఏటీఎస్ పోలీసులు వారిపై నిఘా పెట్టారు. డీఐజీ దీప‌న్ భ‌ద్ర‌న్‌, ఎస్పీ సునీల్ జోషిల నాయ‌కత్వంలోని బృందం ఆ మాడ్యూల్ గుట్టు ర‌ట్టు చేశారు.

Spread the love