5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో పడ్డ గుజరాత్

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్
ఐపీఎల్ లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఢీ కొంటున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోగా, గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కు దిగింది. అయితే ఆరంభంలోనే 5 వికెట్లు కోల్పోయింది. గుజరాత్ కెప్టెన్ శుభ్ మాన్ గిల్ రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. గిల్ 6 బంతుల్లో 8 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు కొట్టి ఊపుమీదున్నట్టు కనిపించిన గిల్ ను ఇషాంత్ శర్మ అవుట్ చేశాడు. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (2) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగడంతో గుజరాత్ కష్టాల్లో పడింది. సాహా వికెట్ ముఖేశ్ కుమార్ ఖాతాలో చేరింది. ఆ తర్వాత సాయి సుదర్శన్ (12) రనౌట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ (2), స్ట‌బ్స్‌ బౌలింగ్‌లో అభిన‌వ్ మ‌నోవ‌ర్ (8) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు  ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 8.3 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్, తెవాటియా క్రీజులో ఉన్నారు.

Spread the love