ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ సంక్షేమ సంఘం

నవతెలంగాణ – ఆర్మూర్
గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చినందుకు  తెలంగాణ బీసీ సంక్షేమ సంఘము ఎన్ ఆర్ ఐ బృందం  సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్ ఆర్ ఐ పాలసీ అమలు చేయాలనీ కోరుతున్నట్టు, గల్ఫ్ కార్మికుల కోసం కోటపాటి నరసింహా రావు ఎంతో కష్టపడుతున్నారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘము ఎన్ ఆర్ ఐ ల తరుపున అధ్యక్షులు బట్టు స్వామి కృతజ్ఞతలు తెలిపారు. వీరితోపాటు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘము ఎన్ ఆర్ ఐ ఉపాధ్యక్షుడు గురాయి రాజేందర్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘము ఎన్ ఆర్ ఐ సౌదీ ఉపాధ్యక్షుడు పీర్ల దేవదాస్ (కుర్మ) లు కృతజ్ఞతలు తెలిపినారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘము ఎన్ ఆర్ ఐ కువైట్ ఉపాధ్యక్షుడు గున్నల విక్రమ్ ,తెలంగాణ బీసీ సంక్షేమ సంఘము ఎన్ ఆర్ ఐ సభ్యులు ఆర్మూర్ లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు.
Spread the love