2020 ఢిల్లీ అల్లర్ల కేసులో గుల్ఫిషా ఫాతిమా బెయిల్‌ పిటీషన్‌ తిరస్కరణ

నవతెలంగాణ – న్యూఢిల్లీ : 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో 31 ఏళ్ల సామాజిక కార్యకర్త గుల్ఫిషా ఫాతిమా దాఖలు చేసిన బెయిల్‌ పిటీషన్‌ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఫాతిమా బెయిల్‌ పిల్‌ను ఈ నెల 25న విచారించాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఉపా చట్టం కింద అరెస్టయిన ఫాతిమా నాలుగేళ్ల ఏడు నెలల నుంచి నిర్బంధంలో ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్లకు భారీ కుట్ర చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సరైన విచారణ కూడా లేకుండా ఆమెను నిర్బంధంలోనే ఉంచారని, విచారణలో అనవసర జాప్యం జరిగితే ఉపా చట్టం వర్తించిందని ఆమె తరుపు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు.

Spread the love