గ్రంథాలయోద్యమానికి పురుడు పోసుకున్న గుండ్రాంపల్లి

తెలంగాణ ప్రజల్లో సాంస్కతిక చైతన్యాన్ని పదును పెట్టడానికై గుండ్రాంపల్లి గ్రామ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. గ్రంధాలయోద్యమంలో పత్రికలు నిర్వహించిన పాత్ర అద్వితీయమైనది గ్రామ రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడానికి వివిధ సంస్థలు, వ్యక్తులు, గ్రంథాలయ నిర్వహణకు కలసికట్టుగా కషి చేశారు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ గ్రంథాలయం హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రంథాలయ ప్రారంభోత్సవం 14 ఏప్రిల్‌ 2006 న జరిగింది. ప్రారంభకులు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఆనాటి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ గాదె వినోద్‌ రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు అనుముల శ్రీనివాస్‌ నిర్వహణ కమిటి ఆధ్వర్యంలో ప్రారంభించారు. గుండ్రాంపల్లి గ్రామ నేపథ్యం ఒకప్పుడు నిజాం వ్యతిరేక ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ. రైతాంగ పోరాటానికి నెలవైన ఈ ఊరులో సుమారు 7000 పై చిలుకు జనాభా కలదు. మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఊరురా గ్రంథాలయం అనే మలిదశ గ్రంథాలయోధ్యమంలో భాగంగా ఈ గ్రంథాలయం 14 ఏప్రిల్‌ 2006 వ సంవత్సరంలో మొదటి గ్రంథాలయంగా పురుడు పోసుకుని నేటికి ఊరురా ఒక ఉద్యమంలా సాగుతుంది.
దాతలు, ఉన్నతులు సహకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ప్రభుత్వం మా గ్రంథాలయాన్ని శాఖా గ్రంథాలయంగా గాని, ఎయిడెడ్‌ గ్రంథాలయం గుర్తించాలని, భవన నిర్మాణానికి, కంప్యూటర్లు, ఫర్నిచర్‌ కొనుగోలు కోసం ఇట్టి గ్రంథాలయానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అబ్యర్దిస్తున్నాం.
– అనుముల శ్రీనివాస్‌, వ్యవస్థాపక అధ్యక్షులు
పెరుగుతున్న పాఠకుల రద్దీ దష్ట్యా అదనపు గదుల నిర్మాణానికి, గ్రంథాలయం ఆధురీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిచంచవలసిందిగా కోరుతున్నాం.
– బత్తుల మల్లేశం,భవన నిర్మాణ కమిటి అధ్యక్షులు
గ్రంథాలయం ఏర్పాటు చేసిన విషయం తెలుసుకుని, పుస్తకాలను రోజు వారిగా సమీక్షిస్తూ గొప్ప అనుభూతికి లోనవుతున్నాను. పుస్తక పఠనం చేయడం ద్వారా గుండ్రాంపల్లి గ్రంథాలయం ఉద్యోగానికి బీజం వేసే దశ నాలో ఏర్పడింది. అందుకు కారణం గుండ్రాంపల్లి గ్రంధాలయం.
– గోపగోని శ్రీనివాస్‌, పాఠకుడు
గ్రంథాలయ ఏర్పాటుకు మూలం: గ్రామస్తులు ప్రాథమిక విద్యాభ్యాసం చేసే రోజుల్లో ఆ ఊర్లో గ్రంథాలయం అందుబాటులో ఉండేది కాదు. ఆ ఊరి గ్రామపంచాయతీకి ఒక దినపత్రిక, ఒక మాస పత్రిక మాత్రమే వచ్చేది. అందరూ చదవడానికి వెళ్తే పేపర్‌ కూడా దొరికేది చాలా కష్టంగా ఉండేది.
గ్రామ గ్రంథాలయ నిర్వహణ కమిటి ని 24 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన శ్రీనివాస్‌ సెప్టెంబర్‌ నాలుగు 2005న మొదటి సమావేశం సరూర్‌ నగర్‌లోని స్నేహితుని ఇంట్లో, రెండవ సమావేశం ఫిబ్రవరి 2, 2006న చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రాంగణంలో సమావేశపరిచి వాళ్ల గ్రామానికి ఏదైనా తమ వంతుగా సహాయం చేద్దామని, తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఆరు గ్రామాలకు కూడా ఉపయోగపడే విధంగా గ్రామీణ గ్రంథాలయ ఏర్పాటు ఆవశక్యత గురించి చెప్పారు. దానికి అందరు ఆమోదించారు. గ్రామ గ్రంథాలయ నిర్వహణ కమిటీని 24 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన శ్రీనివాస్‌ గ్రంథాలయ ఏర్పాటుకు నిధి సేకరణ బాధ్యతను స్వీకరించారు. గ్రంథాలయానికి మొదటి విరాళం సాధారణ పరిస్థితిలకు భిన్నంగా జరిగింది. మొత్తం 24 మంది సభ్యుల మొదటి విరాళంగా ఒక్కరికి 500 రూపాయల చొప్పున మొత్తం 12000/- రూ.లు ఇవ్వడమే కాకుండా పుస్తకాలు దానం చేయండి అని ఒక దిన పత్రికలో ప్రకటన ఇచ్చారు. ఆ వార్త చదివిన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నలువైపుల ఉన్న పుస్తక ప్రియులు వేలాది పుస్తకాలను, ఫర్నిచర్‌ను ఈ గ్రంథాలయానికి బహుమానంగా ఇచ్చారు.
గ్రంథాలయ ప్రారంభోత్సవ ఏర్పాటుకు ఆనాటి గ్రామ సర్పంచ్‌ చెరుకుపల్లి చంద్రయ్య, పాలక మండలి ఒక గదిని గ్రంథాలయానికి కేటాయించారు. గ్రామస్తులు, విద్యావంతులు, గ్రంథాలయ శాస్త్ర నిపుణులు, గ్రంథాలయ పరిరక్షణ సమితి మరియు మేధావుల పాత్ర ఎనలేనిది.
గ్రంధాలయ నిర్వహణ పని చేయు విధానం గ్రంథాలయ నిర్వహణ నెలవారీ ఖర్చులు కమిటీ సభ్యులే భరిస్తూ ఉన్నారు. ఇట్టి గ్రంథాలయం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిపి రోజుకు నలుగు గంటలు, సెలవు దినాలలో అదనంగా మూడు గంటలు పనిచేస్తుంది. వేసవికాలంలో రెండు నెలల పాటు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు గ్రంథాలయం తెరిచి ఉంటుంది.
గ్రంథాలయ పుస్తక సామర్థ్యం: విభిన్నమైనటువంటి పుస్తకాలు జాతీయ అంతర్జాతీయ విషయాలు తెలుసుకునే విధంగా విద్యార్థులు, ఉద్యోగులు చదువుకునే విధంగా ప్రజా సాహిత్యం ఆలోచన ఆసక్తి కలిగించే తెలంగాణ ప్రజా సాంస్కతిక వారసత్వాన్ని పెంపొందించే విషయాలు, సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని, ఆలోచన విజ్ఞానాన్ని పెంపొందించే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.
సాహిత్యం, కథలు, నవలలు, బాల సాహిత్యం, మానవీయ కోణానికి అద్దం పట్టే ఎన్నో రకాల సామాజిక అంశాల పుస్తకాలు, పురాణాలు, వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు వివిద దినపత్రికలు, వార పక్ష, మాస, త్రై మాసిక పత్రికలూ రోజు వచ్చే పాఠకులకోసం అందు బాటులో ఉన్నాయి.
అంతర్జాల సౌకర్యం ఆనాడు గుండ్రాంపల్లిలో కలగానే ఉన్నా ఇప్పుడు పూర్తి విభిన్నంగా గ్రంథాలయంలో అంతర్జాలం ఏర్పాటు చేసి గ్రామ యువకులకు ఉచిత సేవలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రంథాలయ నిర్వాహకులు గ్రంథాలయానికి యువకులను ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలను అందించడం వారికి తగిన పారితోషికం అందించి వారి ఉన్నత చదువులు చదివించేందుకు సహాయపడుతుంది గుండ్రాంపల్లి గ్రంథాలయం, సమాచార కేంద్రం.
గ్రంథాలయ సేవలను వినియోగించుకొని 20 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా కానిస్టేబుల్స్‌, పంచాయతీ సెక్రెటరీ ఉపాధ్యాయ, బ్యాంకింగ్‌ మొదలైన శాఖలలో ఉద్యోగులుగా స్తిరపడ్డారు. అదే విధంగా ఈ గ్రంథాలయం నుండి లబ్ధి పొందినటువంటి యువకులు 35 మంది వివిధ ఉన్నత విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు. మరికొందరు ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
గుండ్రాంపల్లి గ్రంధాలయం నేడు పరిశోధనా కేంద్రంగా విలసిల్లుతున్నది. అదేవిధంగా గ్రంథాలయ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నం జరుగుతున్నది.
గ్రంధాలయ సేవా కార్యక్రమాలు: గుండ్రాంపల్లి గ్రంథాలయ నిర్వహణా కమిటి కేంద్ర వేదికగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ కెరీర్‌ గైడెన్స్‌ పై ఆంగ్లభాష అవగాహన శాస్త్రం నిర్వహించింది. అలాగే ఉచిత దంత వైద్య శిబిరం, గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా ఆట పాటల పోటీలు, సాంస్కతి కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శన నిర్వహించి పాఠకులను ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ విధంగా భవిష్యత్తులో గ్రంథాలయాన్ని ఆధునికరించి యువతీ యువకులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయటం, అంతర్జాల సేవలు అందించి విద్యార్థి విద్యార్థులకు చదివే అలవాటును ప్రోత్సహించడం గ్రంథాలయ సేవలను వినియోగించుకున్న మనోభావాలు సంస్కతి ఐక్యతనిస్తుంది.
ఈ గ్రంథాలయ స్థాపన సామాజికమైనది. ఈ గ్రంథాలయంలో పుస్తకాల సమీకరణ, పుస్తక పఠనం లాంటి వివిధ కార్యక్రమాలు విరివిరిగా జరిగాయి. పలువురి గ్రామస్తుల కలయికకు కూడలి అయింది. ఆనాటి తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధులు ప్రజల మనిషి వట్టికోట, దాశరథి మరియు కాళోజి స్ఫూర్తితో ఈనాడు నడుస్తుంది గుండ్రాంపల్లి గ్రంథాలయం.
గ్రంథాలయోద్యమాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చైతన్యాన్ని ఇచ్చింది. ఈ తరం కషిని అభినందిస్తూ వ్యవస్థాపక కమిటీకి గ్రామ ప్రజలకు చాలా ప్రశంసలు వచ్చాయి. గ్రంథాలయాన్ని గ్రామ గ్రంథాలయ ఉత్సవాలతో మమేకమై వారి కష్టసుఖాలతో పాలుపంచుకొని ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సష్టించి చరిత్రకు నెలవుగా గుండ్రాంపల్లి గ్రంధాలయం నిలిచింది. విలువైన నేటి విజ్ఞానాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఆనాటి వారసత్వాన్ని సష్టిస్తూ గ్రంథాలయోధ్యమ కేంద్రంగా గుండ్రాంపల్లి గ్రామ గ్రంథాలయం నిలిచి ఈ రోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మలిదశ గ్రంథాలయోద్యమంగా గ్రామీణ గ్రంథాలయాల ఏర్పాటుకు ఆజ్యం పోసింది.
– బూర్గు గోపికష్ణ, 7995892410

Spread the love