నవతెలంగాణ – హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠా నుంచి 2 కు పైగా తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 బుల్లెట్ లను కూడా రికవరీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ తుపాకులను ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ కు తీసుకువచ్చి వాటిని విక్రయించాలనే ప్రయత్నంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో కొందరు దొరికారు. కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.