నవతెలంగాణ – హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ వదిలారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.