నేడు గురుకుల జేఎల్‌, డీఎల్‌ల తుది ఫలితాలు

Resultsనవతెలంగాణ-హైదరాబాద్‌: సంక్షేమ గురుకులాల్లో 2,717 జూనియర్‌, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో తుది ఎంపిక ఫలితాలను నియామక బోర్డు ఆదివారం వెల్లడించనుంది. జూనియర్‌ కళాశాలల్లో 1,924.. డిగ్రీ కాలేజీల్లో 793 అధ్యాపక పోస్టులకు గతేడాది ఆగస్టులో రాతపరీక్ష జరిగింది. అందులో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలను ఈ నెల రెండో వారంలో బోర్డు విడుదల చేసింది. ఈ నెల 19, 20 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు నిర్వహించింది. డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించనుంది. దివ్యాంగుల కేటగిరీలో అర్హత పొందిన అభ్యర్థులకు రెండు రోజుల్లో వైద్య పరీక్షలు చేసి.. ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది.

Spread the love