నిజామాబాద్ నగరంలోని ప్రతి డివిజన్లో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ప్రతి డివిజన్లో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కేశవేణు పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హాందాన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ భవన్ నందు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ,పిసిసి ఉపాధ్యక్షులు తాహేర్ బిన్ హందన్ తో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ.. ఈనెల ఏడవ తేదీ నుండి ఏ ఐ సి సి, పిసిసి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ యొక్క భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా నిజామాబాద్ నగరంలోని ప్రతి డివిజన్లో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల ఏడవ తేదీన గోల్ హనుమాన్ నుండి బొబ్బిలి విది,పోచమ్మ గల్లీ, ముదిరాజ్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించి ముదిరాజ్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తామని ఆయన అన్నారు.ఈ పాదయాత్రలో జిల్లా సీనియర్ నాయకులు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేశ వేణు విజ్ఞప్తి చేశారు.ఈ పాదయాత్ర కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని, గత పది సంవత్సరాలుగా బిజెపి టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పెట్రోల్ డీజిల్ నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను, నిరుద్యోగాన్ని ప్రజలకు వివరిస్తామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ గాని ,నిరుద్యోగ యువతకు నెలకు 4000 నిరుద్యోగ భృతి గాని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గాని, ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు గాని, ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల రూపాయలు వైద్యం కొరకు అందిస్తామని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు.ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తహేర్ బిన్ హం దన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ,నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో నిర్వహించే హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, అందరం కష్టపడి పని చేస్తేనే రాబోయే ఎన్నికల విజయం సాధించగలుగుతామని, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యుత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్,రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వీపుల్ గౌడ్, జిల్లా ఎన్ ఎస్ యు ఐ ఆధ్యాక్షులు వేణు రాజ్,పిసిసి కార్యదర్శి రం బూపల్,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నరేందర్ గౌడ్,పిసిసి మెంబర్ ఈసా,జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ జావేద్ అక్రమ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కేశ, అబుద్ బిన్ హందన్,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ,సేవాదళ్ సంతోష్,నగర మైనారిటీ చైర్మన్ ఎజాజ్,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, కేశ సాయి బాబా,నవాజ్, అయ్యుబ్,ప్రవీణ్, దేవి,మధు తదితరులు పాల్గొన్నారు.

Spread the love